మంథని, అక్టోబర్ 27: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అపహాస్యం చేస్తున్నది. రాజకీయంగా బీఆర్ఎస్ను ఎదుర్కోలేక కాంగ్రెస్ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అండతో ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధూకర్‌పై దుష్ప్రచారానికి తెరలేపారు.
బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రచార కార్యదర్శి రఘువీర్‌సింగ్ వీడియో ఆధారాలతో రిటర్నింగ్ అధికారికి ఈ నెల 20న ఫిర్యాదు చేశారు. దీంతో మంథని ఎస్సై కిరణ్‌కుమార్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుపై ఐపీసీ 123(4) ఆఫ్ ఆర్పీ యాక్ట్ 1951, సెక్షన్ 171జీ, 505(బీ) కింద కేసు నమోదు చేసినట్టు ఆర్వో హనుమానాయక్ వెల్లడించారు.