Jagadish Reddy | ప్రభుత్వం ఉద్దేశ్యాన్ని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి బయట పెట్టాడు. నాగార్జున సాగర్ నిండిన రైతులకు నీళ్లు ఇయ్యమని మంత్రి కోమటి రెడ్డే చెప్పాడని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. . ఆరుతడి పంటలు ఏం వేసుకోవాలో ఏ జిల్లాలో ఏం పంటలు పండుతాయని మంత్రులు ఒక్కరంటే ఒక్కరు చెప్పినవారు లేరు. ఏ గింజ పెట్టుకోవాలన్నా నీల్లు కావాలి, రైతులకు నీళ్లు ఎలా ఇస్తారు… ఎప్పుడు ఇస్తారో రైతులకు చెప్పాలి కదా…!
రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందన్నారు. నాగార్జున సాగర్ లో నీళ్లు ఉన్నాయి..సాగర్ ఎడమ కాల్వ క్రింద ఉన్న రైతులకు నీళ్లు ఇవ్వండి. SLBC క్రింద నీళ్లు ఇవ్వడం లేదు…దేవరకొండ ప్రాంత రైతులు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. సాగర్ లో నీళ్లు ఉన్నాయో లేవో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగర్ లో దూకితే తెలుస్తుందని జగదీష్ రెడ్డి మండిపడ్డారు.
518 అడుగుల నీళ్ళు ఉన్నప్పడే బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు నీళ్ళు ఇచ్చింది. నిషేధిత జాబితాలో కొందరి ఎమ్మెల్యేల భూములు ఉన్నాయి. ముఖ్యమంత్రి , ఇద్దరు మంత్రులు సొంత పార్టీలో ఉండే ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. CBI కేంద్రం చేతిలోనే.. ‘రా’ కేంద్రం చేతిలోనే ఉంది కదా ..MIM మధ్య వర్తిత్వంతో లండన్ లో కేటీఆర్, హరీష్ రావు, రేవంత్ రెడ్డి కలిస్తే బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి ఫోటోలు బయట పెట్టొచ్చు కదా. రేపు బీఆర్ఎస్ గెలవబోతుందని అందరికి తెలుసు కాబట్టే కొత్త డ్రామాకు తెరలేపారు. దీనిపై కేసీఆర్, కేటీఆర్ కూర్చొని ప్రభుత్వ ద్రోహం పై ప్రత్యేక కార్యచరణకు ప్లాన్ చేస్తాము. ఎల్నినో టైంలో రైతులకు పంట పండించుకునే అవకాశం ఇస్తే… ఓపెన్ మార్కెట్ లో పంటకు డిమాండ్ ఉండేది కదా…!
భూ భారతితో వచ్చిన సంక్షోభమే ముఖ్యమంత్రి మంత్రుల మధ్య పంచాయతీ. మంత్రుల పంచాయతీ పై మీడియా మిత్రులు చర్చించుకుంటున్నటే..కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు చర్చ చేస్తున్నారు. చిన్నారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు..ఆయన కూడా ప్రస్తుత వనపర్తి ఎమ్మెల్యే కోట్ల రూపాయలు పెట్టీ టికెట్ తెచ్చుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం ,అనిరుద్ రెడ్డి ,మదన్ మోహన్ లాంటి వారు కూడా సొంత ప్రభుత్వం పైనే ఆరోపణలు చేశారు… కాంగ్రెస్ లో సంక్షోభానికి బీఆర్ఎస్, వైసీపీ ల కుట్ర ఉందని కొందరు తెలివి లేకుండా మాట్లాడుతున్నారు.. ఇంకా నయం ట్రంప్ , పుతిన్ లాంటి వాళ్ల కుట్ర ఉందని అనలేదు. కాంగ్రెస్ కొట్లాట ఇస్తారాకుల దగ్గర కుక్కలు కొట్లాడుకున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.
ఎంగిలి విస్తరాకుల కోసం కుక్కలు కొట్లాడుకున్నట్లుగా..
ఈ కాంగ్రెసోళ్లు కూడా పైసల కోసం, వాటాల కోసం కొట్టుకు చస్తున్నారు!– మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS. pic.twitter.com/HD2vSeY0qh
— BRS Party (@BRSparty) August 23, 2026