Mark Carney | అమెరికాతో మేం యుద్ధంలో ఉన్నాం.. కెనడా ప్రధాని సంచలన వ్యాఖ్యలు
Mark Carney | అగ్రరాజ్యం అమెరికా (USA) తో తాము యుద్ధంలో ఉన్నామని కెనడా ప్రధాని (Canada PM) మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 50 శాతం మేర సుంకాలు (50 percent Tarriffs) విధిస్తూ అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకున్న నిర్ణయంపై ఆయన తీవ్రంగా స్పందించారు.
Mark Carney : అగ్రరాజ్యం అమెరికా (USA) తో తాము యుద్ధంలో ఉన్నామని కెనడా ప్రధాని (Canada PM) మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 50 శాతం మేర సుంకాలు (50 percent Tarriffs) విధిస్తూ అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకున్న నిర్ణయంపై ఆయన తీవ్రంగా స్పందించారు. అమెరికా తీసుకున్న ఈ చర్యను తమ దేశంపై జరిగిన ఆర్థిక దాడిగా ఆయన అభివర్ణించారు. ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చలు చివరి నిమిషంలో విఫలమయ్యాయి.
అమెరికా విధించిన షరతులు తమ దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా, కీలక పరిశ్రమలను బలహీనపరిచేలా ఉన్నాయని, అందుకే తాము వాటిని అంగీకరించలేదని మార్క్ కార్నీ స్పష్టంచేశారు. మీపై దాడి జరిగినప్పుడు మీరు యుద్ధంలో ఉన్నట్లే భావించాలని, ఇప్పుడు మాపై దాడి జరిగిందని, అందుకే మేం కూడా యుద్ధంలోనే ఉన్నామని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ట్రంప్ నిర్ణయానికి ప్రతీకారంగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే స్టీల్, గృహోపకరణాలు, వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తులపై తాము కూడా సుంకాలు విధించనున్నట్లు ఆయన ప్రకటించారు.
సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన కెనడా వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించింది. ఇది కెనడా వార్షిక ఎగుమతుల్లో దాదాపు 5 శాతానికి సమానం కావడం గమనార్హం. అయితే అమెరికా తన సుంకాలను తగ్గిస్తే తాము కూడా సానుకూలంగా స్పందిస్తామని మార్క్ కార్నీ తెలిపారు. అమెరికా నుంచి వచ్చే అల్యూమినియం, స్టీల్, మోటార్ వాహనాలపై ఉన్న సుంకాలను తొలగించడానికి సిద్ధంగా ఉన్నామని, అమెరికన్ ఆల్కహాల్ విక్రయాలను తిరిగి ప్రారంభించేలా తమ ప్రావిన్సులను ప్రోత్సహిస్తామని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ అసాధ్యమైన షరతులు విధించడంవల్లే తాము ఒప్పందం నుంచి వైదొలగినట్లు మార్క్ కార్నీ వివరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

