హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని లోక్‌సభ స్థానాలకు కోఆర్డినేటర్లను నియమిస్తూ ఆదివారం కాంగ్రెస్ ఉత్తర్వులు జారీ చేసింది. 17 స్థానాలకు 15 చోట్ల బాధ్యతలను మంత్రులకు, రెండు స్థానాలను మాత్రం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి అప్పగించింది. సీఎం రేవంత్‌రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, మంత్రి పొంగులేటికి 2 స్థానాలు కేటాయించింది. సీఎం రేవంత్‌కు మహబూబ్‌నగర్‌తోపాటు చేవెళ్ల నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది.
భట్టి విక్రమార్కకు సికింద్రాబాద్, హైదరాబాద్, పొంగులేటికి మహబూబాబాద్, ఖమ్మం, సీతక్కకు ఆదిలాబాద్, శ్రీధర్‌బాబుకు పెద్దపల్లి, పొన్నంకు కరీంనగర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి నిజామాబాద్, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి జహీరాబాద్, దామోదర రాజనర్సింహకు మెదక్, తుమ్మలకు మల్కాజిగిరి, జూపల్లికి నాగర్‌కర్నూల్, ఉత్తమ్‌కు నల్లగొండ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి భువనగిరి, కొండా సురేఖకు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది.