Jeevan Reddy | రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గురుకులాన్ని గురువారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ క్రమంలో విద్యార్థుల కోసం సిద్ధం చేసిన నాణ్యత లేని భోజనాన్ని చూసిన జీవన్ రెడ్డి.. గురుకుల సిబ్బందిపై ఆగ్రహం చేశారు.
ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకుంటున్నప్పుడు.. విద్యార్థులకు సరిపడా భోజనం ఎందుకు పెట్టడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఆ గురుకులంలో ఉండే విద్యార్థులకు రెండు గిన్నెల నిండా అన్నం వండితే సరిపోతుంది.. కానీ ఒకే గిన్నెలో అన్నం మాత్రమే ఎందుకు వండుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం ఉడకలేదని, నీళ్ల పప్పు, నీళ్ల చారు ఎందుకు వడ్డిస్తున్నారని ప్రశ్నించారు.
మెనూ ప్రకారం వారంలో రెండు రోజులు విద్యార్థులకు నాన్ వెజ్ పెట్టాల్సి ఉండగా, నెలలో ఒకే రోజు నాన్ వెజ్ పెడుతున్నారని తెలిసి గురుకుల సిబ్బందిపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులంలోని విద్యార్థుల కోసం 30 లీటర్ల పెరుగు వాడాల్సి ఉండగా, కేవలం ఆరు లీటర్ల పెరుగుతో సరిపెట్టడంపైనా సిబ్బందిని నిలదీశారు. వారానికి ఐదు కోడి గుడ్లు ఇవ్వడం లేదని విద్యార్థులు చెప్పడంతో.. దానిపైనా గురుకుల సిబ్బందిని జీవన్ రెడ్డి నిలదీశారు. తన పరిశీలనలో వెల్లడైన సమస్యలను కలెక్టర్కు, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తానని ఆయన స్పష్టం చేశారు.
గురుకుల సిబ్బందికి చివాట్లు పెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గురుకులాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జీవన్ రెడ్డి
ప్రభుత్వం నుండి బిల్లులు తీసుకుంటున్నారు. పిల్లలకు సరిపడా భోజనం పెట్టడానికి ఏంటి కష్టం
రెండు గిన్నెల నిండా అన్నం వండితే… https://t.co/BIiNNxDJ37 pic.twitter.com/a14xXe6gik
— Telugu Scribe (@TeluguScribe) November 28, 2024