Jeevan Reddy | హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ ) : శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఎక్కు వ సమయం మాట్లాడుతుండగా మధ్యలో చైర్మన్ కలుగజేసుకున్నారు. ‘జీవన్రెడ్డిగారు మీరు ఇప్పటికే ఎక్కువ సమయం తీసుకున్నారు..’ అని చైర్మన్ అన్నారు. ‘సార్ నేను మళ్లీ ఉంటనో ఉండ నో.. పోయేముందు కూడా ఇవే గంటలు కొట్టుడా సార్. మీరే చెప్పండి. మీరు ఎట్ల అంటే అట్లనే సార్. మావోళ్లేమో అట్ల అదుపు చేస్తున్నారు.. మీరేమో ఇట్ల అదుపు చేస్తున్నారు’ అని జీవన్‌రెడ్డి సీరియస్‌గానే అన్నారు.
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా దాచుకుంటే ప్రభుత్వం అభాసుపాలవుతుందే తప్పా.. వారికి ఒరిగేదేమీ ఉండదు. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే.. ఉచితాలను రద్దు చేయండి. వాటిని ఎవరు అడుగుతున్నారు?’ అని ఏవీఎన్ రెడ్డి ప్రశ్నించారు.