హైదరాబాద్: అసెంబ్లీలో (Assembly) కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దౌర్జన్యానికి దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అధికార పార్టీ ఎమ్మెల్యే శంకర్ వాటర్ బాటిల్, పేపర్లు విసిరారు. విపక్ష సభ్యులకు చెప్పు చూపించాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఫార్ములా ఈ కార్ రేస్‌పై సభలో చర్చించాలని బీఆర్ఎస్ పట్టుపట్టింది. సమావేశాలు జరుగుతున్నప్పుడు కేటీఆర్‌పై కేసు పెట్టారని, అక్రమ కేసు పెట్టినప్పుడు ఆయనకు చెప్పుకునే అవకాశం ఇవ్వాలని హరీశ్ రావు స్పీకర్‌ను కోరారు. దీనికి స్పీకర్ ప్రసాద్ కుమార్ నిరాకరించడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూ భారతి బిల్లుపై చర్చను ప్రారంభించారు. అయితే ఫార్ములా రేస్‌పై చర్చించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. దీంతో మంత్రి వెనుక సీట్లో కూర్చున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ ఆగ్రహంతో ఊగిపోయారు. తన చైర్లోనుంచి లేచి ప్రతిపక్ష ఎమ్మెల్యేలపైకి వాటర్ బాటిల్, పేపర్లు విసిరారు.
కాగా, విపక్ష సభ్యులకు శంకరయ్య చెప్పు చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ పూర్తి వీడియోను బయటపెట్టాలన్నారు.
పవిత్రమైన శాసనసభలో
కాంగ్రెస్ మార్క్ కండకావరం!ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద
చెప్పు విసిరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. pic.twitter.com/uiSZG7IKp6— BRS Party (@BRSparty) December 20, 2024