Komatireddy Raja Gopal Reddy | మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తారా ఇవ్వారా.. అది మీ ఇష్టం.. నేను మాత్రం దిగజారి బతకలేనని తెలిపారు. పార్టీలు మారిన వాళ్లకు పదవులు, నాలాంటి సీనియర్లకు అవమానమా అని మండిపడ్డారు. ఎవరి కాళ్లు పట్టుకుని మంత్రి పదవి తెచ్చుకోవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు.
నల్గొండలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి ఇస్తానని అన్నారని గుర్తుచేశారు. భువనగిరి ఎంపీ స్థానం గెలిచినప్పుడూ కూడా అదే మాట చెప్పారని అన్నారు. కానీ ఇప్పుడు పార్టీలు మారిన వాళ్లకు, తనకంటే చిన్నవారికి పదవులు ఇచ్చారని తెలిపారు. . మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా.. మీ ఇష్టం అని అన్నారు. ఎవరి కాళ్లూ మొక్కి నేను పదవులు తెచ్చుకోగదలచుకోలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. దిగజారి బతకడం నాకు తెలియదని అన్నారు. మనసు దిగజార్చుకుని బతకడం ఇక నావల్ల కాదంటూ అసహనం వ్యక్తం చేశారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
వేల కోట్లు దోచుకునే వాళ్ళకే పెద్ద పదవులు కావాలి. నేను అందరిలాగా పైరవీలు చేసి దోచుకునే వాడిని అయితే కాదు.. – ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి https://t.co/7rCbInbVkv pic.twitter.com/4In7lPoa3h
— Telugu Scribe (@TeluguScribe) August 5, 2025
తన స్వార్థం కోసం పదవి అడగడం లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాల్లో పదవులు అడ్డం పెట్టుకుని సంపాదించుకోవాలని లేదని అన్నారు. మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని అన్నారు. రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ప్రజలు, వాళ్ల సంక్షేమం కోసం కావాలన్నారు.