వంగూరు, డిసెంబర్ 26 : అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు దిగజారుడు రాజకీయానికి పాల్పడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి సర్పంచ్‌గా బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు సురేందర్ తల్లి నారమ్మ గెలుపొందింది. గ్రామస్తులకు దాహార్తి తీర్చేందుకు స్థానికంగా రెండు మోటర్లను సర్పంచ్ డ్రిల్ చేయించారు.
నీళ్లు పుష్కలంగా పడటంతో మోటర్లు దింపి స్టార్టర్లను బిగింపజేయడంతో గ్రామస్తుల మన్ననలు పొందారు. దీన్ని జీర్ణించుకోలేని అధికార పక్షం ఎలాగైనా సర్పంచ్‌ను బద్నామ్ చేయాలన్న ఉద్దేశంతో బోరు మోటర్ స్టార్టర్పై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు.