Congress Leaders | వనపర్తి : కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా అన్నదాతలతో కలిసి హస్తం నేతలు పోరుబాట పట్టారు. కాంట వేసిన వడ్లు తరలించడం లేదని కొనుగోలు కేంద్రం వద్ద కాంగ్రెస్ నాయకులు రాస్తారోకోకు దిగారు.
వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రంలో తరుగు ఎక్కువగా తీసేస్తున్నారని, కాంట వేసిన వడ్లు తరలించడంలేదని కొనుగోలు కేంద్రం వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. అధికార పార్టీ నాయకులం అయ్యుండి, మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయడం సిగ్గుచేటుగా ఉందని బాధిత రైతులు, కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకుల ధర్నా
కాంట వేసిన వడ్లు తరలించడంలేదని కొనుగోలు కేంద్రం వద్ద రాస్తారోకోకు దిగిన కాంగ్రెస్ నాయకులు
వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రంలో తరుగు ఎక్కువగా తీసేస్తున్నారని, కాంట వేసిన వడ్లు తరలించడంలేదని కొనుగోలు కేంద్రం వద్ద ధర్నాకు దిగిన… pic.twitter.com/60i6KsJ4n4
— Telugu Scribe (@TeluguScribe) May 23, 2025