ఐఐటి విద్యార్థినికి విద్యాధరి ఫౌండేషన్ చేయూత
కొత్తగూడెంలోని విద్యాదరి ఫౌండేషన్ అధ్యక్షుడు బైరి రాజేష్ ఖన్నా శనివారం ఐఐటి విద్యార్థినికి ఆర్థిక సాయం అందజేసి ఆదుకున్నారు. కొత్తగూడెం రైటర్ బస్తి గొల్లగూడెంకు చెందిన టేకుమట్ల స్నేహిత పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు...
కొత్తగూడెం గణేష్ టెంపుల్, ఆగస్టు 08 : కొత్తగూడెంలోని విద్యాదరి ఫౌండేషన్ అధ్యక్షుడు బైరి రాజేష్ ఖన్నా శనివారం ఐఐటి విద్యార్థినికి ఆర్థిక సాయం అందజేసి ఆదుకున్నారు. కొత్తగూడెం రైటర్ బస్తి గొల్లగూడెంకు చెందిన టేకుమట్ల స్నేహిత పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించింది. బిలాస్పూర్ లోని స్కూల్ ఆఫ్ స్టడీస్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఐఐటీ సీటు ఎంట్రన్స్ ఫీజు చెల్లించేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంది. ఈ విషయాన్ని 28వ డివిజన్ కార్పొరేటర్ జల్లి శ్రీలక్ష్మి విద్యాధరి ఫౌండేషన్ అధ్యక్షుడు రాజేష్ ఖన్నాకు వివరించారు. ఎంట్రన్స్ ఫీజు చెల్లించడానికి ఆఖరి రోజు అని తెలియజేయడంతో వెంటనే స్పందించిన రాజేష్ ఖన్నా రూ.10,000/- చెక్కును స్నేహితకు అందజేశారు.
ఈ సందర్భంగా రాజేష్ ఖన్నా మాట్లాడుతూ.. ఉన్నత చదువులు చదవాలని లక్ష్యం పెట్టుకున్న విద్యార్థులు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్న ర్యాంకర్లకు విద్యాధరి ఆధ్వర్యంలో ఆర్థిక సాయం చేస్తూ, వారు భవిష్యత్‌లో ప్రయోజకులుగా మారేందుకు సహాయం చేస్తున్నట్లు చెప్పారు. ఉన్నత విద్య చదవాలనుకునే ఆశయమున్న పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేసేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యాదరి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

