Sai Sudarshan : భారత జట్టుకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంక పర్యటకు దూరమవ్వగా.. ఈసారి యువ బ్యాటర్ సాయి సుదర్శన్ (Sai Sudarshan) సైతం సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. గాయంతో బాధపడుడుతున్న సుదర్శన్ ఇంకా కోలుకోలేదు. దాంతో. లంక రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉండడని బీసీసీఐ వెల్లడించింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-26లో ముందంజ వేయాలనుకుంటున్న భారత జట్టును గాయాలు వేధిస్తున్నాయి. స్టార్ పేసర్ బుమ్రా గాయం కారణంగా శ్రీలంక పర్యటనకు దూరమవ్వగా.. యువకెరటం సాయి సుదర్శన్ సైతం వైదొలిగాడు. కుడి కాలి బొటన వేలి గాయంతో అఫ్గనిస్థాన్‌తో ఏకైక టెస్టు ఆడని ఈ తమిళ తంబీని అనుమానపడుతూనే శ్రీలంక పర్యటనకు ఎంపిక చేశారు.
🚨Sai Sudarshan Replacement 🚨
Sarfaraz Khan is likely to replace Sai Sudarshan in Team India’s test Squad vs Sri Lanka🏏 pic.twitter.com/I4P60uSGN1
— CricInformer (@CricInformer) August 8, 2026
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన ఈ లెఫ్ట్ హ్యాండర్ పూర్తి స్థాయిలో మెరుగుపడలేదు. దాంతో.. అతడు లంకతో రెండు టెస్టులకు అందుబాటులో ఉండడం లేదని శనివారం బీసీసీఐ పేర్కొంది. సుదర్శన్ స్క్వాడ్ నుంచి వైదొలగడంతో అతడి స్థానం కోసం సర్ఫరాజ్ ఖాన్, షేక్ రషీద్ పోటీ పడుతున్నారు. అయితే మూడో స్థానంలో సుదర్శన్ బదులు దేవ్‌దత్ పడిక్కల్ తుది జట్టులో ఉండే అవకాశముంది. మూడు రోజుల వామప్ మ్యాచ్‌లో శతకం బాదిన పడిక్కల్‌ను గాలే టెస్టులో కొనసాగించడం దాదాపు ఖాయమైనట్టే.