Mrunal Takhur | మృణాల్ ఠాకూర్–యశస్వి జైస్వాల్ డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ.. ఘాటుగా స్పందించిన హీరోయిన్!
Mrunal Takhur | బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్ గురించి గత కొంతకాలంగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌తో ఆమె డేటింగ్లో ఉందంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది.
Mrunal Takhur | బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్ గురించి గత కొంతకాలంగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌తో ఆమె డేటింగ్లో ఉందంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై తాజాగా మృణాల్ ఠాకూర్ స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చారు. తనపై వస్తున్న పుకార్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఘాటైన సమాధానం ఇచ్చారు. ఇటీవల ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఓ కేఫ్ నుంచి మృణాల్ ఠాకూర్, యశస్వి జైస్వాల్ వేర్వేరు సమయాల్లో బయటకు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందంటూ నెటిజన్లు ఊహాగానాలు మొదలుపెట్టారు. ఇద్దరూ కలిసి కనిపించకపోయినా.. ఒకే ప్రాంతంలో కనిపించడం డేటింగ్ రూమర్స్‌కు కారణమైంది.
ఈ వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో చివరకు మృణాల్ స్పందించాల్సి వచ్చింది. యశస్వి జైస్వాల్‌తో మృణాల్‌ను లింక్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్టుపై ఆమె ఘాటుగా స్పందించారు. నిరాధారమైన వార్తలను ప్రచారం చేయడంపై అసహనం వ్యక్తం చేస్తూ.. అసలు తన పక్కన యశస్వి ఎక్కడ ఉన్నాడో చూపించాలని ప్రశ్నించారు. చదువుకున్న వారు కూడా ఇలాంటి ఆధారాలు లేని వార్తలను ఎలా నమ్ముతున్నారో అర్థం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. దేశంలో ఎన్నో ముఖ్యమైన విషయాలు జరుగుతున్నాయని, వాటిపై దృష్టి పెట్టకుండా ఇలాంటి చిల్లర వార్తలకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని సూచించారు.
మృణాల్ వ్యాఖ్యలతో యశస్వి జైస్వాల్‌తో తనకు ఎలాంటి డేటింగ్ సంబంధం లేదనే విషయాన్ని ఆమె స్పష్టం చేసినట్లయింది. మృణాల్ ఠాకూర్ పేరు డేటింగ్ రూమర్స్‌లో వినిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో తమిళ స్టార్ హీరో ధనుష్‌తో ఆమె ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను కూడా మృణాల్ వర్గాలు ఖండించాయి. తాజాగా యశస్వి జైస్వాల్తోనూ ఇలాంటి వార్తలు రావడంతో.. తాను ఎక్కడ కనిపించినా, తన చుట్టూ ఉన్న వ్యక్తులను బట్టి సంబంధాలు అంటగట్టడం సరికాదని మృణాల్ పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు. మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు ‘సీతారామం’ సినిమాతో మరింత దగ్గరయ్యారు. ఈ చిత్రంలో సీతామహాలక్ష్మి పాత్రలో ఆమె నటనకు విశేష ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ‘హాయ్ నాన్న’, ‘ది ఫ్యామిలీ స్టార్’ వంటి చిత్రాల్లోనూ నటించారు. ప్రస్తుతం పలు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

