Uddhav Thackeray | ద్రోహులకు టైమ్ కేటాయిస్తారుగానీ యువతకు కేటాయించలేరా..? ప్రధాని మోదీపై ఉద్ధవ్ థాకరే ఫైర్
Uddhav Thackeray | శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray).. ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో ఆందోళనలు చేపడుతున్న యువత సమస్యలను పట్టించుకోని ప్రధాని.. తమ పార్టీని చీల్చి బీజేపీతో అంటకాగుతున్న ద్రోహులతో సమావేశమయ్యేందుకు మాత్రం సమయం కేటాయించారని విమర్శించారు.
Uddhav Thackeray : శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray).. ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో ఆందోళనలు చేపడుతున్న యువత సమస్యలను పట్టించుకోని ప్రధాని.. తమ పార్టీని చీల్చి బీజేపీతో అంటకాగుతున్న ద్రోహులతో సమావేశమయ్యేందుకు మాత్రం సమయం కేటాయించారని విమర్శించారు. శనివారం ముంబైలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో థాక్రే మాట్లాడారు.
శుక్రవారం ఎన్డీయే కూటమితో జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనంతరం, ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఆరుగురు నూతన ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ కావడాన్ని ఉద్ధవ్ థాకరే ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో శివసేన వర్గాల పిటిషన్లపై విచారణ జరుగుతున్న తరుణంలో న్యాయస్థానాన్ని భయపెట్టేందుకే ఈ భేటీని ఏర్పాటు చేశారా..? అని ఆయన ప్రశ్నించారు. ‘యువతను కలిసేందుకు ప్రధానమంత్రికి సమయం లేదుకానీ, ద్రోహులతో సమావేశమవుతారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. మీరు సుప్రీంకోర్టును భయపెట్టాలని చూస్తున్నారా..?’ అని ఉద్ధవ్ థాక్రే నిలదీశారు.
సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధంగానే వస్తుందన్న నమ్మకం తనకుందని ఆయన స్పష్టంచేశారు. దేశంలో ప్రస్తుతం ‘తుపానుకు ముందు ప్రశాంతత’ నెలకొని ఉందని ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యానించారు. జెన్ జీ నిరసనలు ప్రభుత్వాన్ని కదిలించాయని, అయితే వారికి మద్దతు ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వం పోలీసు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. పాలనలో మార్పుకు సమయం ఆసన్నమైందని, కేంద్ర ప్రభుత్వం కేవలం సోషల్ మీడియా వేదికల ద్వారానే పాలన సాగిస్తోందని విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

