సంగారెడ్డి : మున్సిపల్ ఎన్నికల వేళ పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్(Congress) పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీలు దేవానందం, యాదగిరి యాదవ్, వెంకట్ రెడ్డి, దశరథ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ లతో పాటు 500 మంది కార్యకర్తలు మాజీ మంత్రి హరీశ్ రావు నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
పార్టీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు. కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆయన ఆశాభవం వ్యక్తం చేశారు.