జడ్చర్ల : మూడు గంటల కరెంటు చాలన్నా కాంగ్రెస్ విధానాన్ని నిరసిస్తూ నిరంతరంగా బీఆర్ఎస్ లోకి వలసలు కొనసగుతున్నాయి. ఆ పార్టీ విధానాన్ని వ్యతిరేకిస్తూ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లోని చిన్నఆదిరాల, బొమ్మరాసిపల్లి గ్రామాలకు చెందిన సుమారు 200 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు, కుల సంఘాల నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి , సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నిరంతరయంగా పార్టీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. అనంతరం పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ తాము 70 ఏళ్లుగా కరెంటు కష్టాలు అనుభవించామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలోనూ ఏడు గంటలు ఇస్తామని మూడు గంటలు కరెంటు ఇచ్చేవారని తెలిపారు.
బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
అది కూడా సక్రమంగా సరఫరా వచ్చేది కాదన్నారు. తిరిగి కరెంటు కష్టాలను చూడలేమని నిరంతరంగా రైతులకు కరెంటు అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలని పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు. రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న పార్టీ బీఆర్ఎస్ అని, తామంతా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అడుగుజాడల్లో నడుస్తామని చెప్పారు.