నాగర్‌కర్నూల్, జూన్ 25 : రేవంత్ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలతో సొంత పార్టీ నేతలతోపాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి నెలకొన్నదని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకే అధికార పార్టీని వీడి పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు.
నాగర్‌కర్నూల్ మండలం పెద్దముద్దునూరులోని 50 మందికిపైగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గురువారం మర్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా.. కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు మోసపోయామని సొంతపార్టీ కార్యకర్తలే చెబుతున్నారని తెలిపారు. అమలుకాని హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ రైతులు, పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రోజురోజుకూ కేసీఆర్‌పై ప్రజల్లో అభిమానం పెరిగిపోతున్నదని తెలిపారు.