రాయపర్తి/తరిగొప్పుల : 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడంతో విసుగుచెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శనివారం బీఆర్ఎస్లో చేరారు. వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన 20 మంది కార్యకర్తలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
జనగామ జిల్లా తరిగొప్పుల మండలం జాల్బాయ్తండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే పల్లా గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.