Rangareddy | రంగారెడ్డి : కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. ఇచ్చిన హామీలపై రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రశ్నిస్తే.. తట్టుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష నేతలపై దాడులకు పాల్పడుతూ గుండాయిజం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల తీరుతో ప్రజలు సైతం విసిగిపోతున్నారు.
తాజాగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు.
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలు కూడా 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ అమలు కాలేదు. కల్యాణలక్ష్మితో పాటు ఇస్తామన్న తులం బంగారం ఏమైంది..? ఇది రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీనే కదా..? అది అడిగితే తప్పా..? కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు ఎందుకింత ఉలికిపాటు..? మహిళలకు తులం బంగారం బాకీ అనేది వాస్తవం. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..? అని ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తల దౌర్జన్యం
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కేసీఆర్… pic.twitter.com/BmNAWFKjXO
— Telugu Scribe (@TeluguScribe) April 17, 2025