Congress | పటాన్చెరులో రాజనర్సింహ వర్సెస్ జగ్గారెడ్డి.. తనవాళ్లకే టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్
Congress | పటాన్చెరు టికెట్ విషయంలో సీనియర్ నేతలు జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ మధ్య దుమారం రేగినట్టు తెలిసింది. వీరిద్దరూ ఆ టికెట్‌ను తమవారికి ఇవ్వాలంటే తమవారికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నీలం మధుకు జగ్గారెడ్డి, కాట శ్రీనివాస్‌గౌడ్‌కు రాజనర్సింహ మద్దతు పలుకుతున్నారు.
Congress | హైదరాబాద్, నవంబర్ 7(నమస్తే తెలంగాణ): పటాన్చెరు టికెట్ విషయంలో సీనియర్ నేతలు జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ మధ్య దుమారం రేగినట్టు తెలిసింది. వీరిద్దరూ ఆ టికెట్‌ను తమవారికి ఇవ్వాలంటే తమవారికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నీలం మధుకు జగ్గారెడ్డి, కాట శ్రీనివాస్‌గౌడ్‌కు రాజనర్సింహ మద్దతు పలుకుతున్నారు. మూడో జాబితాలో పటాన్చెరువు టికెట్‌ను పార్టీ అధిష్ఠానం నీలం మధుకు కేటాయించడంతో దామోదర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
దశాబ్ద కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న శ్రీనివాస్‌గౌడ్‌ను కాదని, నాలుగు రోజుల క్రితం పార్టీలో చేరిన మధుకు టికెట్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. మధుకు ఇచ్చిన టికెట్‌ను రద్దు చేసి శ్రీనివాస్‌గౌడ్‌కు కేటాయించాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. దీనిపై జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇచ్చిన టికెట్‌ను రద్దు చేస్తే ఊరుకునేది లేదంటూ పార్టీ పెద్దలకు అల్టిమేటం జారీ చేసినట్టు సమాచారం. మరోవైపు, పటాన్చెరు టికెట్‌కు సంబంధించి సుమారు రూ. 30 కోట్ల డీల్ కుదిరినట్టు ప్రచారం జరుగుతున్నది. తాను సూచించిన వారిలో ఒక్కరికి కూడా టికెట్ దక్కకపోవడంపై దామోదర అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. పఠాన్‌చెరు, నర్సాపూర్, నారాయణఖేడ్ టికెట్లను తాను సూచించిన వారికి కాకుండా ఇతరులకు కేటాయించడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

