‘బండి’ నివాసానికి ఈటల
దేశ రాజధాని వేదికగా తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ నివాసంలో బుధవారం జరిగిన లంచ్ మీటింగ్‌కు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు.
- ఢిల్లీలోని సంజయ్ ఇంట్లో లంచ్ మీటింగ్‌కు హాజరు
- తెలంగాణ బీజేపీలో చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామం
హైదరాబాద్, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ) : దేశ రాజధాని వేదికగా తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ నివాసంలో బుధవారం జరిగిన లంచ్ మీటింగ్‌కు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఆయనతోపాటు బీజేపీ ఎంపీలు కే లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈటల బీజేపీలో చేరినప్పటి నుంచి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ ఇంటికి ఈటల వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నది. పరస్పరం ఆత్మీయంగా పలుకరించుకోవడం ఆసక్తిని రేకెత్తించింది. ఇక ఇద్దరి మధ్య విభేదాలు సమసిపోయినట్టేనని రాష్ట్ర పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను బండి సంజయ్ సోషల్ మీడియా, ఎక్స్ వేదికగా పంచుకున్నారు. మంచి సంభాషణలు ఎల్లప్పుడూ కొత్త ఆలోచనలకు దారితీస్తాయని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

