V Hanumantha Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుపై ఎవరూ ఊహించని విధంగా వీహెచ్ వ్యాఖ్యానించారు. ఆయన సునీల్ కనుగోలు కాదు.. సునీల్ కొనుగోలు అంటూ తీవ్ర విమర్శలు చేశారు వీహెచ్. గాంధీ భవన్లో వీహెచ్ మీడియాతో మాట్లాడారు.
లోక్‌సభ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఓటమి జరిగింది.. కొన్ని చోట్ల గెలిచారు. ఓటమి గల కారణాలపై ఏఐసీసీ ప్రతినిధులు ఎంక్వైరీ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను, ఎవరి ఆలోచన వారు తప్పనిసరిగా చెబుతారు. అన్నింటి కంటే ముందు కొనుగోలును అడగాలి. సీఎంను కాదు. సునీల్ కొనుగోలు ఎలాంటి రిపోర్ట్ ఏం ఇచ్చాడో తెలియదు. సునీల్ కొనుగోలులోనే అంతా ఉంది. ఆయన ఏం రిపోర్టు ఇచ్చిండు అనేది తేలాలి. దీపా మున్షి కూడా ఇక్కడే ఉన్నారు. ఎవరి ఓపీనియన్ వారు చెబుతారు. నేను కూడా ఒక క్యాండిడేట్‌ను. నాకు కూడా తీవ్ర అన్యాయం జరిగింది. నేను చెప్పుకోలేకపోతున్నాను అని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యసభకు పంపించే అవకాశం ఇస్తే బాగుంటుంది. ఎనిమిదేండ్లలో నాకు ఒక్క పదవి కూడా లేదు. సికింద్రాబాద్‌లో నాకు ఎంపీ టికెట్ ఇస్తే గెలిచేవాడిని. టీ-20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియా టీమ్‌కు శుభాకాంక్షలు. సిరాజ్‌కు సీఎం రేవంత్ ప్లాట్, ఉద్యోగం ఇస్తాననడం హర్షణీయం. గతంలో అతని ప్రతిభను చూసి సీఎఫ్ఐ చైర్మన్‌గా నేను సన్మానించాను. ఏపీలో 12 క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. తెలంగాణలో స్టేడియానికి ప్రతి జిల్లాలో 12 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని రేవంత్ రెడ్డికి విన్నవిస్తున్నట్లు వీ హనుమంతరావు పేర్కొన్నారు.
సునీల్ కనుగోలు కాదు.. సునీల్ కొనుగోలు
కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో తక్కువ సీట్లు ఎందుకు వచ్చాయో ముఖ్యమంత్రిని కాదు సునీల్ కొనుగోలును అడగాలి.. కొనుగోలు ఇచ్చిన రిపోర్ట్ లోనే అంత ఉంది – వి.హనుమంతరావు pic.twitter.com/FfDt6xYZHC
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2024