నామినేటెడ్ హామీతో మెత్తబడ్డ సంపత్
కాంగ్రెస్ పార్టీలో మాదిగలను అణచివేస్తున్నారంటూ ఏకంగా సోనియాగాంధీకి లేఖ రాసిన మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ చివరకు రాజీ పడ్డారు. ‘మల్లు రవిని గెలిపించండి.. మంచి పోస్టు ఇచ్చే పూచీ నాది’ అని పీసీసీ అధినేత, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇవ్వడంతో మెత్తబడ్డారు.
- ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లిన మల్లు రవి
- మిలాఖత్‌ను జీర్ణించుకోలేక పోతున్న అనుచరులు
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ)/మహబూబ్‌నగర్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీలో మాదిగలను అణచివేస్తున్నారంటూ ఏకంగా సోనియాగాంధీకి లేఖ రాసిన మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ చివరకు రాజీ పడ్డారు. ‘మల్లు రవిని గెలిపించండి.. మంచి పోస్టు ఇచ్చే పూచీ నాది’ అని పీసీసీ అధినేత, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇవ్వడంతో మెత్తబడ్డారు. దీంతో నాగర్‌కర్నూల్ ఎంపీ టికెట్ విషయంలో తలెత్తిన వివాదం ముగిసినట్టేనని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గంలో ఓటమిపాలైన సంపత్‌కుమార్‌తోపాటు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవి నాగర్‌కర్నూల్ (ఎస్సీ రిజర్వ్) ఎంపీ టికెట్ కోసం పోటాపోటీగా ప్రయత్నించారు. నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానంపై గురిపెట్టిన మల్లు రవి చివరకు ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవిని సైతం వదలుకున్నారు. ఇదే టికెట్‌ను ఆశించిన సంపత్‌కుమార్ కూడా ఢిల్లీలో గట్టి ప్రయత్నాలే చేశారు. నియోజకవర్గంలో కూడా ఇరువర్గాలు పోటాపోటీగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మాదిగలను అణచివేస్తున్నారంటూ ఏకంగా సోనియాగాంధీకి సంపత్‌కుమార్ లేఖ రాయడమే కాకుండా దానిని మీడియాకు విడుదల చేయడంతో పరిస్థితి మరింత వేడెక్కింది.
ఇది జరిగిన కొద్ది సేపటికే అధిష్ఠానం మల్లు రవికి టికెట్ ఖరారు చేసింది. దీంతో కంగుతిన్న సంపత్‌కుమార్ అనుచరులు ఆందోళనలకు సిద్ధమవుతుండగా శుక్రవారం అనూహ్య పరిణామం జరిగింది. కాంగ్రెస్ అధిష్ఠానం సంపత్‌కుమార్‌ను బుజ్జగించే బాధ్యతను మల్లు రవికి అప్పగించింది. దీంతో మంత్రి జూపల్లి కృష్ణారావును వెంటబెట్టుకొని మల్లు రవి శుక్రవారం ఉదయం సంపత్‌కుమార్ ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు. తన విజయానికి సహకరిస్తే పార్టీ పెద్దలను ఒప్పించి రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టు ఇప్పిస్తానని మల్లు రవి చెప్పినప్పటికీ సంపత్‌కుమార్ అందుకు అంగీకరించలేదని తెలిసింది. నామినేటెడ్ పోస్టు ఇస్తానని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా హామీ ఇస్తే, అప్పుడు ఆలోచిస్తానని సంపత్‌కుమార్ తేల్చి చెప్పినట్టు సమాచారం. దీంతో మంత్రి జూపల్లి, మల్లు రవి ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, సంపత్‌ను తన వద్దకు తీసుకురమ్మని సూచించినట్టు తెలిసింది. దీంతో వారు సంపత్‌కుమార్‌ను వెంటబెట్టుకొని సీఎం ఇంటికి వెళ్లారు. అయితే, తనకు నామినేటెడ్ పోస్టు ఇస్తారన్న గ్యారెంటీ ఏమున్నదని సంపత్ ప్రశ్నించినట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. నామినేటెడ్ పోస్టు ఇచ్చే బాధ్యత తనేదనని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇవ్వడంతో సంపత్‌కుమార్ తలొగ్గక తప్పలేదని ఈ వర్గాల సమాచారం. రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చే పోస్టు ఇవ్వాలని సంపత్ కోరగా, అందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.తాను పెట్టిన షరతులకు ఒప్పుకున్న తర్వాతనే, మల్లు రవి విజయానికి కృషి చేస్తానని సంపత్‌కుమార్ ప్రకటించడం వెనుక ఇంత కథ జరిగినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. అయితే, నియోజకవర్గంలోని సంపత్‌కుమార్ అనుచరులు మాత్రం మల్లు రవితో మిలాఖత్ కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

