మరిపెడ, డిసెంబర్ 8 : కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రోటోకాల్ పాటించడం లేదు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్ రాంచంద్రూనాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్, రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
అయితే, పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పేర్లు లేకుండా రూపొందించిన శిలాఫలకాతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, ప్రోటోకాల్ విస్మరించారు. దీన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు గుర్తించలేకపోయారా? కావాలనే విస్మరించారా? అని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.