మహబూబాబాద్, మార్చి 22, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రజాపాలనను గాలికి వదిలేసి కమీషన్ల కోసం సీఎం రేవంత్రెడ్డి కకుర్తి పడుతున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవితతో కలిసి ఆమె మాట్లాడారు.
దేశంలో ఇప్పటివరకు ఏ సీఎం చేయనంత అవినీతి రేవంత్రెడ్డి చేశారని పేర్కొన్నారు. చిన్నచిన్న కాంట్రాక్టుల్లో కూడా 10 శాతం నుంచి 12 శాతం కమీషన్లు తీసుకొని బిల్లులు మంజూరు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్లో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తున్నదని చెప్పారు.