TG Budget | హైదరాబాద్ : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో బుధవారం ఉదయం 11.14 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. అనంతరం బడ్జెట్‌ను చదివి వినిపించనున్నారు.
ఇక రేపు ఉదయం 9.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలుపనున్నారు. అనంతరం బడ్జెట్ కాపీలతో భట్టి విక్రమార్క అసెంబ్లీకి చేరుకోనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది రెండో బడ్జెట్.