హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే లంచావతారాలు చెలరేగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. సాక్షాత్తూ రేవంత్ రెడ్డి వద్ద ఉన్న మున్సిపల్ శాఖ పరిధిలోని హెచ్ఎండీఏలో భారీ ఎత్తున పేరుకుపోతున్న ఫైళ్లు దేనికి సంకేతం అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కారణాలు లేకుండా ఫైళ్లను అధికారులు తమవద్దే ఎందుకు తొక్కిపెడుతున్నారని నిలదీశారు. దీని వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో ప్రజలు తెలుసుకోవాలన్నారు.
అనుమతుల్లో అవినీతి నిరోధించేందుకు కేసీఆర్ ప్రభుత్వం టీఎస్-బీపాస్ తెచ్చిందని చెప్పారు. అంతటి పారదర్శక విధానాన్ని కూడా రేవంత్ సర్కారు తుంగలో తొక్కి విచ్చలవిడి అవినీతిని ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ పెద్దలకు అమ్యామ్యాల కోసమే కాంగ్రెస్ సర్కార్ సామాన్య ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే
చెలరేగుతున్న లంచావతారాలు.
నత్తనడకన నడుస్తున్న ఫైళ్లు!సాక్షాత్తూ రేవంత్ రెడ్డి వద్దే ఉన్న మున్సిపల్ శాఖ పరిధిలోని
హెచ్ఎండీఏలో భారీ ఎత్తున పేరుకుపోతున్న ఫైళ్లు దేనికి సంకేతం?కారణాలు లేకుండా ఫైళ్లను తమవద్దే ఎందుకు తొక్కిపెడుతున్నారు… pic.twitter.com/SEkmjWIitl
— KTR (@KTRBRS) September 22, 2024