హైదరాబాద్: పశువైద్య సంచార వాహన సేవలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సోచనీయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు పొందిన గొప్ప కార్యాక్రమాన్ని గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మందుల కొరతతో మూగజీవాల ప్రాణాలు కాపాడాలనే ఆశయం నీరుగారిపోతున్నదని విమర్శించారు. డ్రైవర్, డాక్టర్, సిబ్బందికి వేతనాలు అందక అవస్థలు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 1962 వాహనాల్లో మందులు, వైద్య పరికారాలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు పెండింగ్ వేతనాలు చెల్లించాన్నారు.
‘మూగజీవాల వద్దకే వైద్య సిబ్బంది వచ్చి తక్షణ చికిత్స అందించేందుకు కేసీఆర్ ప్రారంభించిన 1962 -పశువైద్య సంచార వాహన సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం శోచనీయం. కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు సైతం పొంది దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిన గొప్ప కార్యక్రమ నిర్వహణను గాలికి వదిలేసి మూగజీవుల రోదనకు కారణమవుతున్నది. ఒకవైపు వాహనాల్లో మందుల కొరత కారణంగా అత్యవసర పరిస్థితుల్లో మూగజీవుల ప్రాణాలు కాపాడాలనే సదాశయం నీరుగారిపోతుండగా..
మరోవైపు వాహన డ్రైవర్, డాక్టర్, ఇతర సిబ్బందికి వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారి ఆవేదన చెందుతున్నరు. ప్రభుత్వం వెంటనే స్పందించి 1962 వాహనాల్లో మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని, ఉద్యోగ సిబ్బందికి ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.’ అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.
మూగజీవాల వద్దకే వైద్య సిబ్బంది వచ్చి తక్షణ చికిత్స అందించేందుకు గాను కెసిఆర్ గారు ప్రారంభించిన 1962 -పశువైద్య సంచార వాహన సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం శోచనీయం.
కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు సైతం పొంది దేశానికే రోల్ మోడల్ గా నిలిచిన గొప్ప కార్యక్రమ నిర్వహణను గాలికి… pic.twitter.com/Yi6ppmuizp
— Harish Rao Thanneeru (@BRSHarish) September 30, 2024