Telangana | హైదరాబాద్, మార్చి 23(నమస్తే తెలంగాణ): ఒకే మంత్రి, ఒకే ప్రభుత్వం, ఒకే ఉత్త ర్వు.. కానీ మాటలు మాత్రం వేర్వేరు. రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణం చెల్లించిన తర్వాత రూ.2 లక్షలు ఖాతాల్లో జమ చేస్తామన్న అదే నోటితో, నేడు అసలు రూ.2 లక్షలకు పైగా రుణమాఫీ చేస్తామని తాము హామీ ఇవ్వలేదని, తమ ప్రభుత్వ నిర్ణయం కాదంటూ అదే మంత్రి తప్పించుకుంటున్నారు. తమ ఇందిరమ్మ ప్రభుత్వంలో, ప్రజా ప్రభుత్వంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ పూర్తిచేసి తీరుతామంటూ ఫోజులు కొట్టిన సీఎం, మంత్రులు ఇప్పుడు రుణమాఫీ చేయలేక చేతులెత్తేశారు. పూటకో మాట, గడువుకో లెక్క చెప్తూ రైతులను నిండాముంచారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల సాక్షిగా రూ.2 లక్షల రైతు రుణమాఫీకి ప్రభుత్వం చరమగీతం పాడింది.
కాంగ్రెస్ సర్కారు వస్తే తమకు రూ.2 లక్షల రుణమాఫీ అవుతుందని కొండంత ఆశపడిన రైతులను పచ్చిమోసం చేసి మొండిచెయ్యి చూపించింది. దీంతో రెండు లక్షలకు పైగా ఉన్న మొత్తాన్ని బ్యాంకుల్లో చెల్లించి, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షలు ఎప్పుడు మాఫీ అవుతాయోనని ఎదురుచూసిన రైతాంగం ఇప్పుడు కుతకుత ఉడికిపోతున్నది. ప్రభుత్వంపై ఆగ్రహంతో రగిలిపోతున్నది. అధికారంలోకి రాగానే 2023 డిసెంబర్ 9న ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీని విస్మరించిన సీఎం రేవంత్‌రెడ్డికి ఏడు నెలల తర్వాత రుణమాఫీ హామీ గుర్తుకొచ్చింది. ఈ మేరకు 2024 జులై 15న రుణమాఫీకి సం బంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల్లో రూ.2 లక్షల లోపు రుణాలతోపాటు రూ.2 లక్షలకు పైగా ఉన్నా వాటిలో రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి ఆ తర్వాత దాన్ని మర్చిపోయారు. ఏడు నెలల తర్వాత లోక్‌సభ ఎన్నికల ముంగిట మళ్లీ రుణమాఫీ హామీ పత్రాన్ని బయటకు తీశారు. ఎన్నికల ప్రచారం కోసం ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రంలోని దేవుండ్లపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 15లోపు రుణామాఫీ చేస్తామంటూ ఒట్టేసి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారనే విమర్శలు వచ్చాయి. ఆ ఎన్నికలు ముగిసిన నెలకు తీరిగ్గా ఉత్తర్వులు జారీచేసి ఆగస్టు 15 వరకు అరకొరగా రుణమాఫీ చేశారు. నవంబర్ 30న మరోదశ రుణమాఫీ చేశారు. అది కూడా రూ.2 లక్షల లోపు మా త్రమే చేశారు. ఇందులో కూడా చాలామంది రైతులు తమకు రుణమాఫీ కాలేదంటూ ఇప్పటికీ గగ్గోలు పెడుతున్నారు. రూ.2 లక్షలకు పైగా రుణం గల రైతుల పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారింది. కాంగ్రెస్ సర్కారులో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రుల మాటలకు, ప్రభుత్వం ఇచ్చిన ఉత్వర్వులకు విలువే లేకుండా పోతుందని తేటతెల్లమైంది.
కాంగ్రెస్ పాలనలో రైతుల రూ.2 లక్షల రుణమాఫీ అంశం పూటకో మాట, గడియకో లెక్క చందంగా మారింది. చివరికి సర్కారు ఎగనామం పెట్టింది. రుణమాఫీపై తొలుత మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో 72 లక్షల పంట రుణ ఖాతాలు ఉన్నాయని, వీరందరికీ రుణమాఫీ చేయాలంటూ రూ.49 వేల కోట్లు అవసరమని వెల్లడించారు. ఆ తర్వాత 42 లక్షల మందే రైతులు ఉన్నారని, ఇందుకు రూ.31 వేల కోట్లు అవసరమవుతాయని మరోమాట చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వమే స్వయం గా వెల్లడించింది. చివరికి రూ.20,616 కోట్లతో రుణమాఫీని ముగించేసింది. ఇదెలా అని సీఎం ను ప్రశ్నిస్తే.. ‘అదంతా బ్యాంకుల తప్పు. తొలు త లాంగ్‌టర్మ్ రుణాలను కూడా ఇందులో కలిపి రూ.31 వేల కోట్లు అవసరం అవుతాయని చెప్పారు. కానీ తర్వాత మళ్లీ మేం నిర్దిష్ట ఫార్మాట్ పంపిస్తే రూ.20 వేల కోట్లకు తగ్గింది’ అంటూ మాయ లెక్కలను వెల్లడించారు.
ఈ విధంగా రు ణమాఫీ అర్హులు, అవసరమైన నిధులపై మూడుసార్లు మాటమార్చడం గమనార్హం. ఇక చివరికి సీఎం చెప్పిన ఏ లెక్క ప్రకారం కూడా రుణమాఫీ చేయలేదు. మొత్తం 42 లక్షల మంది రైతుల్లో 25.35 లక్షల మందికి రూ.20,616 కోట్లు రుణమాఫీ చేసి మిగిలిన 16.65 లక్షల మంది రైతులకు సర్కార్ ఎగనామం పెట్టింది. ఇంకా రూ. 10,384 కోట్లు రైతులకు బాకీ పడి ంది. ఈ ప్రభుత్వం రుణమాఫీ కోసం బడ్జెట్లో పెట్టిన మొత్తాన్నైనా ఖర్చు చేయకపోవడం గమనార్హం. నిరుడు రుణమాఫీ కోసం రూ.26 వేల కోట్లు బడ్జెట్లో పెట్టింది. ఇందులో రూ. 20, 616 కో ట్లు మాత్రమే ఖర్చు చేసింది. అంటే రూ.5,384 కోట్లు ఖర్చు చేయకుండానే వదిలేసింది.
– ఇదీ 2024 జులై 15న ప్రభుత్వం జారీచేసిన రుణమాఫీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొన్న అంశం.
-2024 సెప్టెంబర్ 15న గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు.
– 2024 సెప్టెంబర్ 24న ఖమ్మంలో మీడియాతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలు
– ఇదీ 2025 మార్చి 22న అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన