హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు పటాపంచలయ్యాయి. మేడిగడ్డ బరాజ్‌పై విచారణకు అత్యుత్సాహం చూపుతూ, మాజీ సీఎం కేసీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేస్తూ, ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తూ వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి తుదకు భంగపాటు తప్పలేదు. రాజకీయ కక్షతో ప్రాజెక్టును బద్నాం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ అడుగడుగునా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఓవైపు తెలంగాణకు ‘జల’ ప్రదాయిని కాళేశ్వరమే అని ప్రభుత్వానికి రెండున్నరేండ్ల తర్వాత తెలిసి వచ్చి మరమ్మతులకు సిద్ధం కాగా, మరోవైపు సర్కార్‌కు చెంపపెట్టులా హైకోర్టు తీర్పు ఇచ్చిందని సాగునీటి రంగ నిపుణులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
అడుగడుగునా దుష్ప్రచారం
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీబరాజ్ (మేడిగడ్డ) 7వ బ్లాక్‌లోని 20వ పిల్లర్ 2023 అక్టోబర్‌లో కుంగుబాటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు ప్రారంభం నుంచీ అక్కసు వెళ్లగక్కుతున్న కాంగ్రెస్ వెంటనే కుట్ర రాజకీయాలకు తెరతీసింది. మేడిగడ్డ బరాజ్ ఘటనను సాకుగా చూపుతూ మొత్తం ప్రాజెక్టే నిష్ప్రయోజనమని, అవినీతి జరిగిందని నాటి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అసత్య ప్రచారం చేసింది. అక్కడితో ఆగలేదు.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లూ కూలిపోతాయని విషం చిమ్మింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బరాజ్‌కు మరమ్మతు చేయడం మాని రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేసింది.
గోదావరి జలాలను ఒడిసి పట్టాల్సిందిపోయి కేసీఆర్‌ను బద్నాం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది. సీఎం, మం త్రులు వరుసగా బరాజ్‌లు సందర్శించి అవి నిష్ప్రయోజనమని, నిరర్థకమని, లక్ష కోట్లు వృథా అని కొండెక్కి మొత్తుకున్నారు. ఇన్వెస్టిగేషన్, సాంకేతిక పరీక్షలు నిర్వహించకముందే డిజైన్ లోపాలు, నాణ్యతాలోపాలే కారణాలంటూ విషప్రచారం చేస్తూ వచ్చారు. అసెంబ్లీలో శ్వేతపత్రం పేరుతో కేసీఆర్ ప్రభుత్వంపై ఆరోపణలకే పరిమితమయ్యారు. ఓవైపు విజిలెన్స్ ఎంక్వయిరీకి, మరోవైపు జ్యుడీషియల్ ఎంక్వయిరీకి ఆదేశించారు. విచారణ అంశాలను అనుకూల మీడియా సంస్థలకు లీకులి స్తూ, ఏదో జరిగిపోతున్నదంటూ అసత్య ప్రచారాలకు తెరలేపారు. ప్రాజెక్ట్ పునరుద్ధరణ అంశాన్ని ప్రభుత్వం ఎన్డీఎస్ఏ దయాదాక్షిణ్యాలకు వదిలేసింది. బీజేపీ నేతలు రాసిన లేఖతో హుటాహుటిన ఎన్డీఎస్ఏ రంగంలోకి దిగడం, పరిశీలనలు ఏవీ చేయకుండానే నివేదిక పేరిట హడావుడి చేయడం తెలిసిందే. ఎన్డీఎస్ఏ నివేదిక ఇవ్వకుండా కాలయాపన చేస్తూ బీజేపీ, నివేదిక వస్తేనే పునరుద్ధరిస్తామంటూ కాంగ్రెస్ కాలం వెళ్లదీశాయి.
నివేదికల పేరిటా రాజకీయం
ఎన్డీఎస్ఏ బృందం ఏర్పాటైన ఏడాది తర్వాత 2025, ఏప్రిల్ 23న 378 పేజీలతో కూడిన పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించింది. బీఆర్ఎస్ రజతోత్సవానికి 2 రోజుల ముందే ఎన్డీఎస్ఏ తుదినివేదిక ఇవ్వ డం, అది ఇరిగేషన్‌శాఖకు చేరకముందే క్షణా ల్లో మీడియాకు లీకు కావడం కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కుట్రలకు అద్దం పట్టింది. ఎన్డీఎస్ఏ నివేదికపైనా కాంగ్రెస్ రాజకీయాలు చేసిం ది. నివేదికను అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి హంగామా సృష్టించింది. మరోవైపు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ పేరిట విషప్రచారానికి పూనుకున్నది. ఆ తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశాల అధ్యయనానికి ప్రభుత్వం నీటిపారుదల శాఖ సెక్రటరీ, న్యాయ శాఖ సెక్రటరీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ సభ్యులుగా కమిటీని నియమించింది. ఆ కమి టీ సైతం 655 పేజీల రిపోర్టును అధ్యయనం చేసి 60 పేజీల రిపోర్టును సమర్పించింది. ప్రభుత్వం ఈ నివేదికను అసెంబ్లీలో పెట్టకముందే వెబ్సైట్లో పెట్టి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మరోసారి విషప్రచారానికి పూనుకున్నది. అన్ని నివేదికలు వచ్చిన తర్వాత కూడా ప్రాజెక్టుపై మరింత లోతుగా విచారించేందుకు సీబీఐ విచారణ చేయించాలని బీజేపీ పట్టుబట్టడం, అందుకు అనుగుణంగానే సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించడంతో 2 జాతీయ పార్టీల కుమ్మక్కు రాజకీయం తేటతెల్లమైంది. ఇలా కాళేశ్వరంపై మొదటి నుంచీ విషప్రచారం చేసిన కాంగ్రెస్, పిల్లర్ కుంగుబాటు తర్వాత రాజకీయ కుట్రలకు తెరలేపిందని నిపుణులు చెప్తున్నారు. వీటన్నింటికీ చెంపపెట్టులా హైకోర్టు తీర్పు ఇచ్చిందని స్పష్టంచేస్తున్నారు.
కాళేశ్వరంపై కాంగ్రెస్ రాజకీయం ఇలా..