Telangana | తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు అటు ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమయ్యాయి. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ క్రమంలోనే బుధవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన అనంతరం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. 42 పేజీల శ్వేత పత్రాన్ని సభ్యులకు అందించారు. కాగా.. ప్రభుత్వ శ్వేతపత్రానికి ధీటుగా కౌంటర్ ఇవ్వాలని బీఆర్ఎస్ సిద్ధమైంది. అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేయడానికి ముందే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ ఒక డాక్యుమెంటరీని విడుదల చేసింది. ఇందులో కేసీఆర్ హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను వెల్లడించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం
బీఆర్ఎస్ విడుదల చేసిన డాక్యుమెంట్