Telangana Debts | మరో 7,000 కోట్ల అప్పు.. ఇప్పటివరకు కాంగ్రెస్ తెచ్చిన అప్పు 25,900 కోట్లు
Telangana Debts | రాష్ట్రంలో పాలన చేపట్టి 30 నెలలు దాటుతున్నా సొంత ఆదాయ వనరులను పెంచుకోవడంలో విఫలమవుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అప్పుల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నది.
Telangana Debts | హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాలన చేపట్టి 30 నెలలు దాటుతున్నా సొంత ఆదాయ వనరులను పెంచుకోవడంలో విఫలమవుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అప్పుల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో తొలి రోజే రూ.7000 కోట్లు రుణ సమీకరణ చేసింది. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రతి మంగళవారం నిర్వహించే ఓపెన్ మారెట్ ఈ-వేలంలో రాష్ట్ర ఆర్థికశాఖ పాల్గొని సెక్యూరిటీ బాండ్లు పెట్టింది. 13 ఏండ్ల కాలపరిమితితో 7.53 వార్షిక వడ్డీకి రూ.1000 కోట్లు, 18 ఏండ్ల కాలపరిమితితో 7.64 వార్షిక వడ్డీకి మరో రూ.2000 కోట్లు, 23 ఏండ్ల కాలపరిమితితో 7.65 వార్షిక వడ్డీకి మరో రూ.2000 కోట్లు, 29 ఏండ్ల కాలపరిమితితో 7.65 వార్షిక వడ్డీకి మరో రూ.2000 కోట్లు తీసుకున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) ఇప్పటికే రూ.18,900 కోట్లు రుణ సమీకరణ చేసింది.
రెండో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్) రూ.21,000 కోట్లు అప్పు తీసుకుంటామని ప్రతిపాదనలు పంపించింది. ఇందులో భాగంగా మంగళవారం రూ.7000 కోట్ల రుణ సమీకరణ చేసింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి తీసుకున్న అప్పు రూ.25,900 కోట్లకు చేరింది. గత బడ్జెట్ అంచనాల్లో రుణ సమీకరణను రూ.54,009 కోట్ల వరకే ప్రతిపాదించినప్పటికీ.. ఒక ఆర్బీఐ నుంచే ఓపెన్ మారెట్ రుణాల రూపంలో రూ.85,840 కోట్లను అప్పుగా తీసుకున్నది. బడ్జెట్ ప్రతిపాదనలతో పోలిస్తే ఇది ఏకంగా 158.93 శాతం అధికం. ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరానికిగానూ మొత్తం రూ.80,000 కోట్ల రుణ సమీకరణ చేయాలని తాజా బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించింది.
2026-27లో ఆర్బీఐ నుంచి రాష్ట్ర సర్కార్ తీసుకున్న అప్పు ఇలా..
తేదీ మొత్తం
- ఏప్రిల్ 7 – రూ.3,900 కోట్లు
- ఏప్రిల్ 21 – రూ.3,000 కోట్లు
- మే 5న – రూ.4,000 కోట్లు
- మే – 19న రూ.2000 కోట్లు
- జూన్ – 2న రూ.4,000 కోట్లు
- జూలై – 1న రూ.7000 కోట్లు
- మొత్తం – రూ.25,900 కోట్లు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
SI Lingam | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు : ఎస్సై లింగం
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

