Bathukamma Sarees | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉపాధి కోల్పోయి విలవిల్లాడుతున్న చేనేత కార్మికులకు ఉపాధి చూపి ఆదుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేసినట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు స్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నేతన్నలను పూర్తిగా మరిచిందని పేర్కొన్నారు. గత 2017 నుంచి 2023 వరకు ఎంతో ఆర్థికంగా ఎదిగిన నేతన్నల పొట్టలుగొట్టి, వారి ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైందని తెలిపారు. ఈ ఏడాది నుంచి నేతన్నలకు బతుకమ్మ చీరల తయారీ బాధ్యతలను ఇవ్వకపోవడంతో ఉపా ధి కోల్పోవాల్సిన పరిస్థితులు దాపురించాయని తెలిపారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎంకి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి.