హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ముగ్గురు ఇన్చార్జి మంత్రులను తొలగించింది. కొత్తగా ఉమ్మడి పది జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు సీనియర్ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖను జిల్లాల బాధ్యతల నుంచి తప్పించింది.
వీరి బాధ్యతలను కొత్త నియామకమైన మంత్రులు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరికి అప్పగించింది. మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరావు, సీతక్క గతంలో ఇన్చార్జులగా వ్యవహరించిన జిల్లాలను మార్చింది. మిగిలిన వారిని యథాతథంగా కొనసాగిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. గ్రేడింగ్‌లో వెనుకబడినందునే ఇన్చార్జి బాధ్యతల తొలగింపు, శాఖల మార్పు అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
ఉమ్మడి జిల్లాల ఇన్చార్జి మంత్రులు
జిల్లా ఇన్చార్జి మంత్రి
ఆదిలాబాద్ జూపల్లి కృష్ణారావు
నిజామాబాద్ ధనసరి సీతక్క
కరీంనగర్ తుమ్మల నాగేశ్వరరావు
మెదక్ వివేక్ వెంకటస్వామి
వరంగల్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ఖమ్మం వాకిటి శ్రీహరి
నల్లగొండ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
రంగారెడ్డి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్ పొన్నం ప్రభాకర్
మహబూబ్‌నగర్ దామోదర రాజనర్సింహ