Indiramma Illu | హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లలో కోత విధించింది. మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం.. 3.24 లక్షల ఇండ్లు మాత్రమే మంజూరు చేయగా, 2.74 లక్షల ఇండ్లకే పనులు ప్రారంభమయ్యాయి.
మరో వైపు మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇస్తామన్న ప్రభుత్వం, రెండో విడతలో ఆ మొత్తంలో సగానికి పైగా కోత పెట్టింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. రెండో విడతలో 2.50 లక్షల ఇండ్లు నిర్మించనున్నట్టు తెలిపింది. నియోజకవర్గానికి 1,500 చొప్పున 100 నియోజకవర్గాలకు 1.50 లక్షలు, రూఫ్ రిప్లేస్మెంట్ కింద నియోజకవర్గానికి 500 చొప్పున 50 వేలు, రిజర్వ్ కోటా కింద 50 వేలు కలిపి మొత్తం 2.50 లక్షల ఇండ్లు నిర్మించనున్నట్టు పేర్కొన్నది.