హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు సంస్థల్లోని డైరెక్టర్ పోస్టులను సర్కారు ఎట్టకేలకు భర్తీచేసింది. ఇన్చార్జి డైరెక్టర్ల స్థానంలో నాలుగు విద్యుత్తు సంస్థలకు రెగ్యులర్ డైరెక్టర్లను నియమించింది. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిట్టల్ మంగళవారం నాలుగు వేర్వేరు జీవోలను జారీ చేశారు.
ఉత్తర, దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థలతోపాటు రాష్ట్ర విద్యుత్తు సరఫరా సంస్థ(టీజీ ట్రాన్స్‌కో), విద్యుత్తు ఉత్పత్తి సంస్థ(టీజీ జెన్ కో)లో కూడా కొత్త డైరెక్టర్లను నియమించింది. టీజీ జెన్కో కోల్ అండ్ లాజిస్టిక్స్ డైరెక్టర్‌గా రైల్వే, సింగరేణి సంస్థల్లో పనిచేసిన బి నగ్యాను నియమించారు.
అయితే ఆయన తెలంగాణలో పనిచేసేందుకు ఆసక్తిచూపడంతో సర్కారు ఆయనకు అవకాశం కల్పించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ఇన్చార్జి డైరెక్టర్లల్లో ఒకరికి అవకాశం దక్కింది. మిగతా వారిని పక్కనపెట్టింది. విద్యుత్తు సంస్థలవారీగా కొత్త డైరెక్టర్ల వివరాలిలా ఉన్నాయి.