హైదరబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress) గూండాలు రెచ్చిపోతున్నారు. అధికారం తమ చేతుల్లో ఉందన్న అహకారంతో బీఆర్ఎస్ (BRS) పార్టీ నాయకులు, కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో (Manuguru) బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. పార్టీ ఆఫీస్పే ధ్వసం చేసి ఫర్నీచర్‌కు నిప్పుపెట్టారు. కార్యాలయం ఆవరణలో ఉన్న ఫ్లెక్సీలను చించేశారు. బీఆర్ఎస్ కార్యాలయన్ని ఆక్రమించి కాంగ్రెస్ రంగులు వేస్తున్నారు. దాడికి ముందే కాంగ్రెస్ రంగులు, స్టిక్కర్లు, ఫ్లెక్సీలు ముద్రించి తమవెంట తెచ్చుకున్నారు. పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. కాగా, కాంగ్రెస్ నేతలు నిప్పు పెట్టడంతో చుట్టుపక్కల ఇండ్లలో షార్ట్ సర్య్కూట్ అయ్యి గృహోపకరణాలకు నష్టం వాటిల్లింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది.


బ్రేకింగ్ న్యూస్
బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ అల్లరి మూకల దాడి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు బీఆర్ఎస్ కార్యాలయంలో జెండా గద్దెను ధ్వంసం చేసి, కార్యాలయ భవనం మీద దాడి చేసిన కాంగ్రెస్ గుండాలు
పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి, ఫ్లెక్సీలు చింపి, ఫర్నిచర్… pic.twitter.com/QjKqQtMext
— Telugu Scribe (@TeluguScribe) November 2, 2025