హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంటిపై కోడి గుడ్లు, టమాటాలు విసిరేశారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కుర్చీలతో దాడికి దిగారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. సవాళ్లు, ప్రతిసవాళ్ల నడుమ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి నివాసానికి తన అనుచరులతో కలిసి వెళ్లారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే గాంధీ అనుచరులు పోలీసులను తోసుకుంటూ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో గేటు దూకి కౌశిక్ రెడ్డి ఇంట్లోకి చొచ్చుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు.. అక్కడే ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. కోడిగుడ్లు, టమాటాలు విసిరేశారు. ఇంటి అద్దాలను కుర్చీలతో ఇంటి అద్దాలను పగులగొట్టారు. పోలీసులపై చేయిచేసుకున్నారు.
అక్కడే ఉన్న ఎమ్మెల్యే గాంధీ దాడి చేసేలా వారిని ఎగదోశారు. నీ ఇంటికి వచ్చా.. చూస్కుందాం రా.. అంటూ కౌశిక్ రెడ్డికి గాంధీ సవాల్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బయటకు రావాలంటూ అక్కడే బైఠాయించారు. దీంతో పోలీసులు గాంధీని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఇంత జరుగుతున్నా గాంధీ అనుచరులు, కాంగ్రెస్ గూండాలను పోలీసులు నిలువరించలేకపోవడం గమనార్హం. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు క్యాంప్ ఆఫీస్‌పై దాడి ఘటన మరువక ముందే కౌశిక్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ కార్యకర్తలు విధ్వంసం సృష్టించడం విశేషం.
పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిన అరికేపూడి గాంధీ మరియు అతని అనుచరులు https://t.co/liNbZfMftl pic.twitter.com/uokDxTEPJZ
— Telugu Scribe (@TeluguScribe) September 12, 2024