చిక్కడపల్లి, మే 1: అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ ఒక్క టీ అమలు చేయలేదని, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే భారీఎత్తున ఉద్యమిస్తామని నిరుద్యోగ జేఏసీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. జూన్ 2 వరకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. శుక్రవారం చిక్కడపల్లిలోని నగర గ్రంథాలయం లో నిర్వహించిన సమావేశంలో జేఏసీ నేతలు కయ్య వెంకటేశ్, కిరణ్ రాథోడ్, కుమార్ మాట్లాడారు. జూన్ 2వరకు హామీలు అమలు చేయకపోతే సీఎం రేవంత్, మం త్రుల ఇండ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నమ్మి నిరుద్యోగులం మోసపోయి గోసపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 2 లోపు 29, 46, 108, 04 జీవోలను రద్దు చేసి ఉద్యోగ వయసు పరిమితిని 46 ఏండ్లకు పెంచి ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.