హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : రైతుబంధు వేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు జరుపాలని డీసీసీలకు గాంధీభవన్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ఫొటోలకు పాలాభిషేకం చేయాలని సూచించింది.
క్షీరాభిషేకం ఫొటోలను, పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సేకరించి గాంధీభవన్‌కు పంపాలని ఆదేశాలు వెళ్లాయి.