హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బతుకమ్మ చీరలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బం ద్ చేసిందో చెప్పకుండా మంత్రి సీతక్క పొంతనలేని వ్యాఖ్యలు చేయడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎక్స్ లో గురువారం ఓ ప్రకటనను పోస్టు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా రూ. 300 కోట్లతో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిందనే సత్యాన్ని ఒప్పుకున్నందుకు ముందుగా మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు. మహాలక్ష్మి పథకానికి రాష్ట్రంలోని రేషన్‌కార్డు కలిగి ఉన్న 93 లక్షల కుటుంబాలలో 18 ఏళ్లు నిండిన ఒక మహిళను అర్హులుగా తీసుకుంటే.. 10 నెలలుగా నెలకు 2,500 చొప్పున ఒకొకరికీ 25,000 వేలు బాకీ పడ్డారు అని మాజీ మంత్రి లెక్కలు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రూ. 23,250 కోట్లు మహిళలకు బాకీ పడిందని తెలిపారు. రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా, మోసం చేయడమే కాకుండా, రూ. 3,325 కోట్ల లెక చెప్పి, చెల్లించాల్సిన రూ. 23,250 కోట్లు కప్పిపుచ్చారని విమర్శించారు. కల్యాణలక్ష్మి చెకుతోపాటు అదనంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు.