మద్దూరు(ధూళిమిట్ట), డిసెంబర్13: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు తిరస్కరించి, గులాబీ జెండాను ఎగురవేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లోని లద్నూర్, ధర్మారం, సలాఖపూర్, గాగిళ్లాపూర్, మద్దూరు, రేబర్తి, వంగపల్లి, వల్లంపట్ల, కూటిగల్, రెడ్యానాయక్‌తండా, హనుమతండా, కొండాపూర్, బెక్కల్, బైరాన్‌పల్లి, తోర్నాల, జాలపల్లి, ధూళిమిట్ట, లింగాపూర్‌లో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండేండ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి శూన్యమని, కేసీఆర్ పాలనలో పల్లెలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందినట్టు తెలిపారు. రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించనున్నట్టు తెలిపారు.