Fake Notes | కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో దొంగ నోట్లు కలకలం సృష్టించాయి. వర్ని మండలంలోని ఓ బ్యాంకులో పంట రుణం చెల్లించేందుకు ఓ రైతు తీసుకొచ్చిన డబ్బులను దొంగ నోట్లుగా అధికారులు గుర్తించారు. గురువారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ చేయగా కీలక విషయం బయటపడింది. సర్పంచ్ ఎన్నికల్లో ఈ దొంగ నోట్లను పంచినట్లుగా నిర్ధారించినట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే.. కామారెడ్డి జిల్లా వర్ని మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన సాయిలు మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో పంట రుణం తీసుకున్నాడు. చాలా రోజుల నుంచి లోన్ పెండింగ్లో ఉండటంతో గురువారం నాడు ఆ లోన్ చెల్లించేందుకు వెళ్లాడు. మొత్తం రూ.2.08 లక్షలను చెల్లించాడు. అవన్నీ 500 నోట్లు కావడంతో క్యాషియర్ మిషన్లో చెక్ చేయగా.. దొంగనోట్లుగా తేలింది. దీంతో వెంటనే క్యాషియర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో హుటాహుటిన బ్యాంకుకు వచ్చిన పోలీసులు సాయిలును అదుపులోకి తీసుకుని అక్కడే విచారించారు. అంత డబ్బు ఎలా వచ్చిందని నిలదీశారు. తన కొడుకు ఇచ్చాడని సాయిలు చెప్పాడు.
ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు బాగోతం బయటపడింది. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి జోరుగా ఈ దొంగ నోట్లను పంచినట్లుగా తెలిసింది. కాగా తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలవడం గమనార్హం. ఇక సదరు అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు కావడంతో ఈ దొంగ నోట్ల వ్యవహారం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
బాన్సువాడలో దొంగ నోట్ల కలకలం
సర్పంచ్ ఎన్నికల్లో 500 రూపాయల దొంగ నోట్లు పంచిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి
నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం, జలాల్ పూర్లో ఘటన
సర్పంచ్ ఎన్నికల్లో జోరుగా దొంగ నోట్లు పంపిణీ చేసిన అభ్యర్ధి
ఆ నోట్లతో కెనరా బ్యాంకులో క్రాప్ లోన్… pic.twitter.com/cipdkjZKZ3
— Telugu Scribe (@TeluguScribe) December 19, 2025