హైదరాబాద్, జనవరి16 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ద్రోహం చేస్తున్నదని లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు ముడావత్ రాంబల్నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలోర మండిపడ్డారు. మున్సిపల్ వార్డుల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కేటాయించకపోవడాన్ని ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక సర్వే నిర్వహించి, ఆ మేరకు రిజర్వేషన్లు పరిగణనలోకి తీసుకోకుండా 2011 లెక్కలను తీసుకోవడం సమంజసం కాదని పేర్కొన్నారు.