పాన్‌గల్, మార్చి 9 : పదేండ్ల కేసీఆర్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సూరారంలో వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం తెల్లరాళ్లపల్లి తండాకు చెందిన 100 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే బీరం సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నా యకుడు రంగినేని అభిలాష్‌రావు, మాజీ ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌నాయక్, నాయకులు కిషన్‌నాయక్, చక్రీగౌడ్ పాల్గొన్నారు.