జనగామ : తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న దార్శనిక పాలకుడని పేర్కొన్నారు. అభివృద్ధి చేయలేని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్నికల సమయంలో అసత్య ప్రచారం చేస్తాయని వాటి మాటలు నమ్మి మోసపోతే గోసా పడతామని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు.
జిల్లాలోని దేవరుప్పుల మండలం పెద్దమడూరు లకవత్ తండా తూర్పు తండా (డి), లకావత్ తండా తూర్పు పెద్దతండా గ్రామాల నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆ పార్టీలను వీడి సమీక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి ఎర్రబెల్లి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలన్నారు. పార్టీలో చేరిన వారికి సుమచిత స్థానం గౌరవం ఉంటుందని హామీనిచ్చారు. ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని సూచించారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న జిల్లా యువజన నాయకుడు బబ్బురి శ్రీకాంత్ గౌడ్ ను మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేకించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో పెద్దమడూరు గ్రామ సర్పంచ్ ఆకవరం సుజనారెడ్డి, ఎంపీటీసీ పానుగంటి గిరి, ఉప సర్పంచ్ మానుపాటి వెంకటేష్, సీనియర్ నాయకుడు దివోజు కిశోర్ కుమార్, గ్రామ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు బండారి రాములు, పోచంపల్లి కొండయ్య, గ్రామ యూత్ అధ్యక్షుడు గోడిశాల శివ, యువజన నాయకులు పానుగంటి కృష్ణ, చంద్రగిరి సంపత్ పాల్గొన్నారు.