గంభీరావుపేట, సెప్టెంబర్ 23 : కాంగ్రెస్ పాలనలో మంచి నీళ్ల కోసం(Drinking water) కూడా మహిళలు రోడ్లపైకి రావాల్సిన దుస్థితి నెలకొంది. కరెంట్ లేక నీళ్లు రాక తెలంగాణ ఆడబిడ్డలు అష్టకష్టాలు పడుతున్నారు. తాజాగా గత పది రోజులుగా తాగునీళ్లు రావడం లేదని.. తాము పడుతున్న కష్టాలు తీర్చాలని సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట(Gambhiraopet) మండల పరిషత్ కార్యాలయం ఎదుట డబుల్ బెడ్రూం కాలనీవాసులు ధర్నా చేశారు.
మండల కేంద్రంలోని బీసీకాలనీ డబుల్ బెడ్రూం సముదాయంలో 168 కుటుంబాలు ఉండగా, గత పది రోజులుగా కాలనీలో తాగు నీరు రావడం లేదని అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోకపోవ డంతో ఆగ్రహించిన మహిళలందరూ మండల పరిషత్ కార్యాలయానికి తరలివచ్చారు. తక్షణమే అధికారులు స్పందించి తాగు నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | రాష్ట్రంలో ప్రజా పాలన కాదు.. గూండా రాజ్యం నడుస్తుంది : హరీశ్‌రావు
TG Rain Alert | తెలంగాణలో మరో మూడురోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
KTR | దాడులతో సునీతా లక్ష్మారెడ్డి మనో ధైర్యాన్ని దెబ్బతీయలేరు : కేటీఆర్