Telangana | నేటి నుంచి గురుకుల పరీక్షలు ప్రారంభం.. మూడు షిఫ్టుల్లో ఎగ్జామ్స్
Telangana | నేటి నుంచి గురుకుల పరీక్షలు ప్రారంభం.. మూడు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ తెలంగాణలోని అన్ని గురుకుల విద్యాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 23వ తేదీ వరకు పోస్టులవారీగా పరీక్షలు కొనసాగనున్నాయి.
Telangana | హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని అన్ని గురుకుల విద్యాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 23వ తేదీ వరకు పోస్టులవారీగా పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ మేరకు తెలంగా ణ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు (ట్రిబ్) ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది. ఒకో పరీక్షకు రెండు గంటల సమయం చొప్పున ప్రతిరోజూ ఉదయం 8:30-10:30 గంటల వర కు, 12:30-2:30, 4:30-6:30 గంటల వరకు మొత్తంగా మూడు షిఫ్టుల్లో పరీక్షలను నిర్వహించనున్నారు. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులతో పరీక్షలు ప్రారంభంకానుండగా, అనంతరం టీజీటీ, పీజీ టీ, డీఎల్, జేఎల్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులకు సబ్జెక్టులవారీగా పరీక్షలను నిర్వహించనున్నారు. ఎ స్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో కలిపి 9 క్యాటగిరీల్లో పీజీటీ- 1,276, టీజీటీ-4,020, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్ -2,876, టీజీటీ, స్కూల్ లైబ్రేరియన్- 434, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ -275, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్-226, మ్యూజిక్ టీచర్ -124 పోస్టులు మొత్తంగా 9,210 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ట్రిబ్ ఈ నియామక ప్రక్రియను చేపట్టింది. అన్ని పోస్టులకు కలిపి 2,63,045 దరఖాస్తులు వచ్చాయని ట్రిబ్ ఇప్పటికే వెల్లడించింది. పోస్టుల్లో అత్యధికంగా మహిళలకే కేటాయించారు. ఆగస్టు 1 నుంచి 23 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో పరీక్షలను నిర్వహించాలని ట్రిబ్ తొలిసారిగా నిర్ణయించింది.
17 జిల్లాల్లో 106 కేంద్రాలు
నియామక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ట్రిబ్ చర్యలు చేపట్టింది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షలను నిర్వహించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలను రూపొందించామని ట్రిబ్ కన్వీనర్ డాక్టర్ మల్లయ్యభట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. నేటి నుంచి 23వ తేదీ వరకు జరిగే పరీక్షల కోసం 17 జిల్లాల్లో 106 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మొదటిసారిగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని, రోజుకు మూడు షిఫ్టుల్లో పరీక్షలు ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు 30 నిమిషాల ముందే చేరుకోవాలని సూచించారు. ప్రశ్నప్రతం ఓపెన్ చేసేందుకు అవసరమైన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను పరీక్ష ప్రారం భం కావడానికి 10 నిమిషాల ముందు మాత్రమే అభ్యర్థులకు అందిస్తారని తెలిపారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించారు. నెగెటివ్ మారులు ఉంటాయని, ప్రతీ తప్పు సమాధానానికి పావు మారు కట్ చేస్తారన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

