హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): సమగ్ర కుటుంబ సర్వేపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలని, ప్రజల సందేహాలను ఎప్పటికప్పుడు తీర్చాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార సూచించారు. ప్రధానంగా పట్టణాలపై దృ ష్టి పెట్టాలని కోరారు. సర్వేపై శనివారం ఆయన ఉన్నతాధికారులతో వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు ఎన్యూ మరేటర్లతో మాట్లాడితే ప్రజల సందేహాల ను తెలుసుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు భాగ స్వాములయ్యేలా చూడాలని చెప్పారు.
సర్వేలో భాగంగా గవర్నర్ జిష్ణుదేవ్ వ ర్మ వివరాలను అధికారులు సేకరించారు. ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, గవర్నర్ ముఖ్య కా ర్యదర్శి బుర్రా వెంకటేశం, కలెక్టర్ అనుదీ ప్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ స్నేహ తదితరులు పాల్గొన్నారు.