Hydra | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హైడ్రా అమలుకు ఫిర్యాదులు : కమిషనర్ రంగనాథ్
Hydra | ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి సైతం హైడ్రా అమలు చేయాలని ఫిర్యాదులు అందుతున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.
నల్గొండ : ఉమ్మడి నల్లగొండ ( Nalgonda ) జిల్లాలో హైడ్రా అమలు చేయాలని ఫిర్యాదులు ( Complaints ) అందుతున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ( Hydra Commissioner Ranganath ) వెల్లడించారు. ప్రభుత్వం నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. జిల్లాలోని మిర్యాలగూడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
హైదరాబాదులో 10 లక్షలకు కోట్ల విలువచేసి భూములు అన్యక్రాంతం అయ్యాయని, వీటిలో 2,100 ఎకరాల చెరువులు , పార్కులు, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. హైడ్రాకు ఇప్పటివరకు 30 వేల ఫిర్యాదులు వచ్చాయని పేర్నొన్నారు. ఇటీవల అమీన్పూర్లో ముఖిమ్ సంధ్య శ్రీధర్ రావు, మల్లారెడ్డికి సంబంధించిన భూములను సైతం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఇటీవల కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చట్ట ప్రకారమే ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. ఎంఐఎం, కాంగ్రెస్ ప్రతిపక్షాలకు సంబంధించిన అక్రమ కట్టడాలను సైతం కూల్చి వేశామని వివరించారు. ప్రస్తుతం హైదరాబాదులో 25 చెరువులు స్వాధీనం చేసుకున్నామని, మరో 100 చెరువులు స్వాధీనానికి ప్రణాళిక రూపొందించామన్నారు.
ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో పర్యావరణం, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు వాకింగ్ ట్రాక్, ఫిజికల్ యాక్టివిటీస్ పార్కులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇవన్నీ రెండు సంవత్సరాల లోపు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

